గ్రూప్-1పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి :వరంగల్ సిపి

గ్రూప్-1పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి :వరంగల్ సిపి
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
ఈనెల 9న జరగబోయే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కట్టు
దీట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలో 76 సెంటర్లు 35 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్ష కేంద్రానికి హాజరవుతున్నారని తెలిపారు.పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుండి 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు గ్రూప్-1 పరీక్ష ఉదయం 10:30 నుండి ఒకటి గంటల వరకు జరగనుంది. కాబట్టి అభ్యర్థులు సెంటర్ దగ్గరికి త్వరగా చేరుకోవాలని సిపి సూచించారు.
