అజరామరుడు పి వి రావు సేవలు ఎనలేనివిదళితుల ఐక్యత కోసం ఎంతో కృషి చేశారు.

మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్యజ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) అజరామరుడు పీవీ నరసింహారావు సేవలు ఎనలేనివని మాలల జాతి అధ్యక్షులు చెన్నయ్య అన్నారు.దళితులను ఐక్యంగా ఉంచేందుకు ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా మాల మహానాడు ను ఏర్పాటు చేసి మహోద్యమాన్ని నడిపి సుప్రీం కోర్టు ద్వారా వర్గీకరణ ను కొట్టి వేయించిన ఘనుడు పి.వి.రావు (పాములపర్తి విఘ్నేశ్వర రావు) అని చెన్నయ్య పేర్కొన్నారు.శుక్రవారం నాడు సంగారెడ్డి పట్టణం లో జిల్లా అధ్యక్షులు డాక్టర్ జనార్దన్ అధ్యక్షతన శ్రీ పి. వి. రావు 75 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులను . ఏ బి సి డి లు గా వర్గీకరించటాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క పిలుపుతో లక్షలాది మంది మాలలను ఏకం చేసి సచివాలయాన్ని ముట్టడిచేస్తే నియంత నిరంకుశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం తో మాలల పై పోలీసులు లాఠీల తో విరుచుకుపడి బాస్పవాయు గోళాలు , ప్రయోగించటం తో పాటు గుర్రాలతో తొక్కించిన ఘటనలో ఇద్దరు మరణించగా వందల సంఖ్య లోకాళ్ళు చేతులు విరగటం జరిగింది ఈ ఘటనలో పి వి రావు కి కూడా చేయి విరిగి దవడ ఎముక విరిగి తీవ్ర గాయాలు అయ్యాయని , ఉద్యమ క్రమం లో ఉద్యోగం పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మడిమ తిప్పక మాల జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన దీరుడు రావు గారని చెన్నయ్య కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్, డాక్టర్ జనార్దన్ లు మాట్లాడుతూ పి వి రావు సేవలను కొనియాడారు . జిల్లా నాయకులు అనంతయ్య, బి . మల్లేష్,మొగలయ్య, బక్కన్న, మేకల విజయరావు, నర్సయ్య, శ్రీనివాస్, పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »