దేశానికి వెన్నెముక వ్యవసాయం… రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

- పామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
- హాజరైన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 03:
షాబాద్ మండలంలోని ఆస్పల్లీ గూడ గ్రామంలో వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పామ్ ఆయిల్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ నారయణ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాలోని 18 మండలాలలో ఒకేరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ,దేశానికి వెన్నెముక వ్యవసాయమని,అందరూ వ్యవసాయం లో అధిక ఆదాయం పొందే పంటలు పండించాలని అన్నారు.ఇందులో భాగంగా పామ్ ఆయిల్ తోట పెంపకం ఉత్తమమని సూచించారు.మన జిల్లాలో ఒక పామ్ ఆయిల్ కంపని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.జిల్లాలో 300 ఎకరాలలో మొక్కలు నాటే లక్ష్యం లో భాగంగా 200 ఎకరాలలో పూర్తి చేశామని చెప్పారు.దీనికి ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం,మిగిలిన సన్న,చిన్నకారు రైతులకి 80 శాతం సబ్సిడీ వస్తుందన్నారు.
అనంతరం రంగారెడ్ది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధు సుదన్ రెడ్డి మాట్లాడుతూ… రైతులు ఎవరు కూడా భయపడకుండా అందరూ పామాయిల్ తోట సాగు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బ్యాంక్ అధికారులతో, అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పాడు.
స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ…దొంగల భయం,కోతుల బెడద లేని పంట పామ్ ఆయిల్ పంట అని రైతులు అందరూ ధైర్యం చేసి పామ్ ఆయిల్ పంట సాగు చేయాలని కోరారు.పామ్ ఆయిల్ కంపెనీ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ,డిప్యూటీ తహశీల్దార్ మధు,షాబాద్ సి ఐ కాంతా రెడ్డి,సర్దార్ నగర్ మార్కేట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి,డి హెచ్ ఎస్ ఒ సురేష్,డి ఎ ఒ నరసింహ రావు,ఎ డి హెచ్ కిషన్ రావు,ఎ డి ఎ .బిజె సురేష్, వాల్యూ ఆయిల్ సి ఈ ఒ రామకృష్ణ,డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ప్రమోద్,షాబాద్ ఏ ఓ వెంకటేష్, హెచ్ ఓ కీర్తి కృష్ణ,రైతులు శ్రీరామ్ రెడ్డి,రితిక్ రెడ్డి,రాఘవరెడ్డి, ప్రతాప్ రెడ్డి,చేవెళ్ల స్వామి గౌడ్,మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్,ఆర్య వైశ్య సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా,ఎండి అన్వర్,గంధం గౌరిశ్వర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
