గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
- ఎలాంటి అనుమతి లేకుండా అయా పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్స్ అమ్మకం
- గుర్తింపు లేని ఓపెన్ పర్మిషన్తో సిబిఎస్సి పేరు చెప్పి, లక్షల్లో డబ్బులు వసూళ్ళు
- అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్, ప్రైవేటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
- ఎస్ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా నాయకులు లిఖిత్ కుమార్
జ్ఞాన తెలంగాణ, (కందుకూరు):
మహేశ్వరం డివిజన్ లో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుపుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ డిమాండ్ చేస్తుందని
గుర్తింపు లేకుండా ఓపెన్ పర్మిషన్తో సీబీఎస్సీ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ రంగారెడ్డిజిల్లానాయకులు లిఖిత్ కుమార్ తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజులు వసులు చేయవలసింది పోయి ప్రవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలే తనకంటూ ఒక చట్టం ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకొని, వాళ్లకు నచ్చిన విధంగా ఫీజు వసూలు చేస్తూ విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర్నుండి దోపిడీ చేస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఎ డిమాండ్ చేస్తుందని అన్నారు. మహేశ్వరం డివిజన్ పరిధిలో ఎల్కెజీ విద్యార్థికి రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు, అనేక పత్రికలలో వచ్చింది. కానీ విద్యాధికారులు ఏ విద్యాసంస్థల్లో ఎన్ని ఫీజులు ఉండాలని బహిర్గతంగా ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ టైం బెల్టు అమ్మడం నేరమైనప్పటి, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నరు. విద్యాధికారులు, ఇప్పటికైనా అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల ఫీజులను అరికట్టే విధంగా, విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.