నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే ప్రైవేటు పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బోధన్ పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన విలేకరుల సమాజంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ ప్రైవేట్ , కార్పొరేట్ స్కూల్ యజమాన్యం విద్యార్థులకు బుక్స్, షూస్, యూనిఫామ్ అమ్మకూడదని ప్రభుత్వం హెచ్చరించిన కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఈ ధంధాను యథేచ్చగా కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ అలాగే విద్యార్థులకు అధిక ధరలకు షూస్ ,బుక్స్, యూనిఫామ్ అమ్మడం వంటివి చేస్తున్న పాఠశాలలను సీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని యెడల పాఠశాలలో నోట్ బుక్స్ పట్టుబడితే విద్యార్థి సంఘం తరపున బీద విద్యార్థులకు పుస్తకాలను పంచిపెట్టే కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.కావున ఎంఈఓ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివ, మజీద్, విగ్నేష్, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
