వెయ్యి గొంతులు – లక్ష డప్పులు మహా కళా ప్రదర్శనను విజయవంతం చేయాలి

వెయ్యి గొంతులు – లక్ష డప్పులు మహా కళా ప్రదర్శనను విజయవంతం చేయాలి
డప్పోల్ల రమేష్, ప్రముఖ కవి, రచయిత
రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి
జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29:
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో తడ్కల్ గ్రామంలో నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అలిగే జీవన్ మాదిగ, ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోరుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు పిబ్రవరి 3న హైదరాబాదులో జరుపతలపెట్టిన ‘వెయ్యి గొంతులు – లక్ష డప్పులు’ మహా కళా ప్రదర్శనను విజయవంతం చేయాలని’ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ‘వెయ్యి గొంతులు – లక్ష డప్పులు’ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి ప్రముఖ కవి, రచయిత డప్పోల్ల రమేష్ మాదిగ హాజరయ్యారు. వివిధ గ్రామాల డప్పు కళాకారులు డప్పు సప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డప్పోల్ల రమేష్ మరియు అలిగే జీవన్ మాదిగ వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల వర్గీకరణే దళితుల ఐక్యతకు మార్గం వేస్తుందన్నారు. వర్గీకరణ లేని ఐక్యత అసాధ్యం అని అన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ ఉద్యమం ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయాన్ని సాధించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. వెయ్యి మంది కళాకారులు లక్ష మంది డప్పు కళాకారులు ఫిబ్రవరి 3న హైదరాబాద్ నడిగుడ్డులో మహాకళా ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి డప్పు భుజాన వేసుకొని వచ్చి మహా ప్రదర్శన విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి అమృత్ బండారి, నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అలిగే జీవన్ మాదిగ, జర్నలిస్టు ఫోరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ, సంగారెడ్డి జిల్లా కళానాయకుడు సంఘల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, గౌడ్ గామా మాణిక్ మాదిగ, తడకల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శి యాదయ్య, సహాయ కార్యదర్శి చిలుకా గంగారాం వివిధ గ్రామాల డప్పు కళాకారులు పాల్గొన్నారు
