పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జ్ఞానతెలంగాణ, చిట్యాల జూన్ 09:
జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో 2004 -2005 పదోతరగతికి చెందిన 260 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో 120 విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో పాఠాలు బోధించిన ఉపాధ్యాయు ని ఉపాధ్యాయులను పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు.పదవ తరగతి చదివి 20 సంవత్సరాలు అయినదని
తమలోని స్నేహితులు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారువారిని ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు అని ఇంకా కొందరు సాఫ్ట్వేర్, మరియు ఇతరాత్ర పనులు చేసుకుంటున్నారని ఒకరికి ఒకరు ఆనందంగా చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులు వెంకటమల్లయ్య వెంకటరమణ కుమారస్వామి సుధాకర్ రాజేందర్ ప్రకాష్ మోహన్ కళ్యాణి శ్రీదేవి దుర్గ లు పాల్గొన్నారు.
తోటి విద్యార్థులు అనివార్య కారణాలవల్ల మరణించిన వారిని గుర్తు చేసుకుని వారికీ ఘనంగా నివాళులు అర్పించి మనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బుర్ర వెంకటేష్, మైదం మహేష్, తౌటం. రాజు, చింతల రాజేందర్,శ్రీకాంత్,రాజేష్,కవిత, స్వప్న, సృజన మరియు తదితరులు పాల్గొన్నారు
