ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి..

ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి..


ఆర్య వైశ్య మహాజన యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 05: ఆర్యవైశ్యుల అభివృద్దికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలో సామ సరస్వతీ గార్డెన్ లో జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది.ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం జిల్లా ఆధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నరాల పూర్ణచందరుప్తా,చొక్కంపేట రాకేషుప్తా,యాచం నవీన్ గుప్తా, జిల్లా మహాసభ ఉపాధ్యాక్షులుగా గడ్డం రమేష్ గుప్తా,నర్సింహులు గుప్తా,వెంకట రమణ గుప్తా లచే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, ఆర్యవైశ్యుల్లో ధనవంతులే కాదు, పేదలు కూడా ఉన్నారన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సాయిరాం గుప్తా, కృష్ణ గుప్తా,బస్వరాజ్ గుప్తా,కిషోర్ గుప్తా, వెంకటేష్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, మదన్ గుప్తా, రామ్మెహన్ గుప్తా, రాఘవేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »