అదుపుతప్పి బోల్తా కొట్టిన మినీ వ్యాన్


జ్ఞాన తెలంగాణ // సంగారెడ్డి// కొండాపూర్//జూన్ 08.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని ముంబాయి జాతీయ రహదారి పై ఉదయం 11 గంటల సమయంలో వి ట్రాన్స్పోర్ట్ కి చెందిన TS 15 UF 5802 గల మినీ వ్యాన్ పటాన్చెరు నుండి ఎంఆర్ఎఫ్ పరిశ్రమకు ముడి సరుకు బస్తాలతో వెళుతుంది.మల్కాపూర్ చింతల్ దాటగానే శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ దగ్గర ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో దానిని తప్పించే క్రమంలో ఈ మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది.


ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా ఇంకో వ్యక్తి ఉన్నారు.
డ్రైవర్ కి స్వల్ప గాయాలు కాగా, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
జాతీయ రహదారి కావడంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జామ్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న మినీ వ్యాన్ పక్కకు తీయించి ట్రాఫిక్ ని పునర్దించారు.

You may also like...

Translate »