ద్విచక్రం వాహనంపై వెళ్తున్న మహిళను డీ కొట్టిన లారి.

మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఆరంగర్ చౌరస్తా బ్రిడ్జి కింద రోడ్డు ప్రమాదం.

అక్కడికక్కడే మృతి.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

మృతదేహంను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.

జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ద్విచక్ర వాహనాన్ని మినీ బస్సు ఢీకొనడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీ చంద్రాయణగుట్ట ఆషమాబాద్ ప్రాంతానికి చెందిన బారాబూద్ (18) విద్యార్థిని. ఆమె సోమవారం ఉదయం రాజేంద్రనగర్ ప్రాంతం నుంచి ఆరంగర్ చౌరస్తా మీదుగా తన స్వస్థలానికి వెళ్తుంది. ఈ క్రమంలో ఆరంగర్ చౌరస్తాలో ఉన్న బ్రిడ్జి కింద మినీ ట్రావెల్స్ బస్సు ఆమె ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే సమాచారం అందుకున్న ట్రాఫిక్, సివిల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You may also like...

Translate »