ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారిని సన్మానించిన పెద్దమందడి రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు

- జీవో.346 ప్రకారం పెద్దమందడి పెద్ద చెరువు మరమ్మతుకై 1 కోటి 12 లక్ష రూపాయల మంజూరు.
- ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని సన్మానించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామ రైతులు,కాంగ్రెస్స్ నాయకులు.
జ్ఞాన తెలంగాణ, పెద్ద మందడి మండల ప్రతినిధి :
పెద్దమందడి పెద్ద చెరువు మరమ్మత్తుల కోసమై GO.346 ప్రకారం 1 కోటి 12 లక్షల రూపాయలను నిన్న మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి గారిని గ్రామ రైతులు,పెద్దమందడి కాంగ్రెస్స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసి, వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్చి జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి గారు, వనపర్తి జిల్లా యువజన అధ్యక్షులు ఆదిత్య , మాజీ ఎస్ఎంసి చైర్మన్ టైలర్ రవి, టిఎంఆర్ నాయకులు ఎస్ రాఘవేందర్, గొల్ల పుల్లన్న యాదవ్, బోయ స్వామి, నీలం రవి, రాజశేఖర్, సాయి కుమార్, కిషోర్, లోకేష్ మరియు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.