జీవన్ సేవ వెల్ నెస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం.


జ్ఞాన తెలంగాణ – బోధన్
జీవన్ సేవ వెల్ నెస్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం బోధన్ పట్టణంలోని సెంట్ ఆందోనిస్ హైస్కూల్ లో మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మసాజ్ థెరపీ, ఆక్యూపెక్చర్ థెరపీ, నేచురోపతి చికిత్సలు అందించారు. అలాగే కీళ్ల నొప్పులు, బిపి, మధుమేహం, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, గ్యాస్టిక్ సమస్యలు, చర్మ వ్యాధులు , లివర్ సమస్యలు, స్త్రీ ఆరోగ్య సంబంధ వ్యాధులకు, పక్షవాతం, అర్షమొలలు, నేత్ర సమస్యలు, ఊబకాయం, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం సందర్భంగా బోధన్, ఎడపల్లి, నవీపేట్, రెంజల్, సాలురా మండలాల నుండి రోగులు తరలివచ్చారు. ఈ శిబిరంలో 400 పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో న్యూరో పెయిన్ థెరపీ నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, నేచురోపతి వైద్యులు డాక్టర్ నాగనాథ్, డాక్టర్ సదనంద్ గౌడ్ ,నేచురోపతి హకీం, సిబ్బంది గీత, సంజన తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »