సిఐటియు కార్మిక నాయకులు మాజీ ఎమ్మెల్యే పర్స సత్యనారాయణ 9వ వర్ధంతి

సిఐటియు కార్మిక నాయకులు మాజీ ఎమ్మెల్యే పర్స సత్యనారాయణ 9వ వర్ధంతి
- భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన పర్స సత్యనారాయణ
జ్ఞాన తెలంగాణ,రాజేంద్ర నగర్:
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో కార్మిక నాయకుడు ఆదర్శమూర్తి పర్సా సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వర్ధంతి సభ నిర్వహించారు
ఈ కార్యక్రమానికి **ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ హాజరై మాట్లాడుతూ పర్స సత్యనారాయణ 19 ఏళ్ల వయసులోనే ఎర్రజెండా చేతబట్టి పేదల పక్షాన పోరాటం చేసి గొప్ప కమ్యూనిస్టు నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పర్స సత్యనారాయణ కీలక పాత్ర వహించి భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అనేక పోరాటం నిర్వహించిన నాయకుడు అలాగే 1970లో సిఐటియు ఆవిర్భావం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పర్స సత్యనారాయణ గారు నండూరి ప్రసాద్ రావు గారు వ్యవస్థాపక సభ్యులలో ముఖ్యులు అని అన్నారు తెలుగు రాష్ట్రాలలో కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ 12 గంటల గురించి అనేక పోరాటం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రమోహన్ కోశాధికారి కవిత ఉపాధ్యక్షులు రుద్ర కుమార్ సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ బుగ్గ రాములు ఎల్లయ్య వీరయ్య ప్రవీణ్ పెంటయ్య రాములు కాటేదాన్ పారిశ్రామిక ప్రాంత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.