ప్రశ్నించిన గొంతుక పై 68 కేసులు

ప్రశ్నించిన గొంతుక పై 68 కేసులు
ఎక్కడో పుట్టిన తనువు
పేద బతుకుల కోసం ఆరాటం
సమాజం పట్ల సంఘర్షించిన ఆ ప్రశ్న
సంఘటితం చేసింది నేటి తరాన్ని
అందుకేనేమో ఆ గొంతుక పై 68 కేసులు
ఆగమైన జీవుల కోసం
అలుపెరుగని పోరాటం అన్యాయం జరిగిన ప్రతి చోట
ప్రశ్నై నిలబడ్డది మన కోసం
అందుకేనేమో ఆ గొంతుక పై 68 కేసులు
అధరక బెదరక ముందుకు సాగుతూ
ఎన్ని అడ్డంకులు ఏదురైన అండగా ఉంటూ
గుండె నిండ ధైర్యం నింపి
ప్రశ్నై ఏదురించింది దోపిడి వర్గాన్ని
అందుకేనేమో ఆ గొంతుక పై 68 కేసులు
ప్రశ్నే తన ఊపిరగా చేసుకొని..
ప్రశ్నే తన ఆయుధంగా మలుచుకొని
ప్రశ్నతోనే మన సమస్యలకు పరిష్కారం అంటూ నిత్యం ప్రజలను చైతన్య పరిచింది ఆ గొంతుక
అందుకేనేమో ఆ గొంతుకపై 68 కేసులు
బడ బాబుల బరతం పట్టింది
దోపిడి దొంగలను ఎలుగెత్తి చూపింది
కబ్జాదారుల కోరలు విరిసి
అహంకార ప్రభుత్వ మెడలు వంచింది
అందుకేనేమో ఆ గొంతుక పై 68 కేసులు
మన కోసం ప్రశ్నించిన గొంతుక పై చర్చిద్దాము
మనం ఏమీద్దామో ఆలోచించుకుందాము
ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న తో కలిసి నడుద్దాం
నడుము బిగించి MLC ఎన్నికల్లో ఆయువు పోద్దాం మల్లన్నను గెలిపించుకొని మన ప్రతినిధిగా చట్ట సభకు పంపిద్ధాం….