54 ఏళ్ల రాజీలేని పోరాటాలు చేస్తున్న “సిఐటియు”

54 ఏళ్ల రాజీలేని పోరాటాలు చేస్తున్న “సిఐటియు”
- ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం
- ఐక్య ఉద్యమాలను ముందుకు నడిపిద్దాం..
- సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎన్ రాజు పిలుపు
జ్ఞాన తెలంగాణ:
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ కు 1948 కనీస వేతనాలు చట్టం ఆధారంగా కనీస వేతనాలు నిర్ణయిస్తూ 2024 జనవరి 29న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిందని 2024 మార్చి 31 లోపు అభ్యంతరాలు సూచనలు తెలియజేయమని కార్మిక సంఘాలకు జీవోలు పంపారని సదరు జీవోలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెరిగిన ధరల ఆధారంగా పెంచలేదని ఈ నిర్ణయం కార్మికుల కడుపులు కొట్టి యజమానుల బొజ్జలు నింపేదిగా ఉందని కార్మికుల కనీస అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోలేదని యాజమాన్య సంఘాలకు తలగ్గినట్లు ఉన్నదని కొత్త సీసాలో పాత సారా మాదిరి పాత జీవుల మూల వేతనానికి పెరిగిన డిఏ పాయింట్లు రేట్లు కలిపి కొత్తగా మూలవేతనం నిర్వహించిందని దీనివల్ల కార్మికుల వేతనాలు ఏమాత్రం పెరగకపోగా పెరిగిన ధరల ప్రకారం చూస్తే ఇంకా బాగా తగ్గాయని ఈ విధానాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
1957 సంవత్సరంలో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం కనీస వేతనాలు నిర్ణయానికి ప్రతిపాదికగా ఉండాలని ప్రభుత్వం యాజమాన్యాలు కార్మిక సంఘాలు ఆమోదించాయని రోజుకు కనీసం 2007 వందల కేలరీల శక్తినిచ్చే ఆహారం కార్మికుడు తీసుకోవాలని కనీస వేతనంలో కుటుంబం 3 వినియోగ యూనిట్ లో అయ్యే ఆహారం ప్రతి యూనిట్కు 18 గజాలు చొప్పున 72 గజాల దుస్తులు 10 శాతం ఇంటి అద్దె కనీస వేతనాలపై 20 శాతం ఎన్నో ఖర్చులు ఉండేటట్లు చూసుకొని కనీస వేతనాలు నిర్ణయించాలని దాన్ని పక్కన పెట్టి యాజమాన్యాలు చెప్పే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దాడి కార్మిక వర్గం పైన విపరీతంగా పడుతుంటే దాన్ని అడ్డుకట్ట వేయవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలను ఆచరణలో పెట్టే దానికి పోటీ పడుతున్నాయని ఈ సందర్భంగా రాబోయే కాలంలో దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న యూనియన్లను కలుపుకొని ఐక్య ఉద్యమాలను నిర్మించి కార్మిక వర్గం తరఫున పెద్ద ఎత్తున పోరాటాలకు ఊపిరి పోయడం కోసం 54వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది.
రాబోయే కాలంలో కార్మిక హక్కులు కాపాడబడాలన్న కనీస వేతనాలు చట్టాలు కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలతో కూడిన హక్కులు వాటిని రక్షించుకోవాలన్న ఐక్య ఉద్యమాలు నిర్వహించడమే ఏకైక మార్గమని ఈ సందర్భంగా గుర్తించుకొని ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ నాయక్, మున్సిపల్ యూనియన్ నాయకులు యాదయ్య, రాజు ,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జంగయ్య, వెంకటేష్ ఆటో యూనియన్ నాయకులు మహబూబ్ బాబా తదితరులు పాల్గొన్నారు.