మూడవసారి నరేంద్రమోదీ గెలుపు ఖాయం బిజెపితోనే అభివృద్ధి సాధ్యం

మూడవసారి నరేంద్రమోదీ గెలుపు ఖాయం బిజెపితోనే అభివృద్ధి సాధ్యం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటం భాస్కర్ గౌడ్జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) కేంద్రంలో వరుసగా మూడవసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటం భాస్కర్ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 370 అధికరణను రద్దు చెయ్యడంతో, అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల హృదయాలను గెల్చుకోవడం జరిగిందని భాస్కర్ గుర్తు చేశారు. నరేంద్రమోదీ పరిపాలనలో భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయని, నేడు ప్రపంచంలో బలమైన ఆర్ధిక వ్యవస్థ కల్గిన దేశంగా భారత్ అవతరించిందని ఆయన పేర్కోన్నారు. మరొకసారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేస్తే దేశం మరింత ప్రగతి పథంలో నడుస్తుందని కాటం భాస్కర్ గౌడ్ స్పష్టం చేశారు.
