డ్రంక్ అండ్ డ్రైవ్ లో 30 మందికి జరిమాన

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 30 మందికి జరిమాన.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 7
సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం రోజు తనిఖీలు నిర్వహించగా 30 మంది పట్టుబడినట్లు, వారికి రూ. 14, 600 రూపాయల జరిమాన విధించినట్లు సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ఎం.రామకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఎం.రామకృష్ణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.