తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వబౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:


తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వబౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

జఫర్ గడ్ మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చవనబోయిన సోమనర్సయ్య అధ్వర్యంలో ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా సోమనర్సయ్య మాట్లాడుతూ పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి ప్రజల వద్దకే పాలన అందించిన నాయకుడు ఎన్టీ రామారావు అని నిరుపేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకులు ఎన్టీ రామారావు గారని పింఛన్లు అందించిన నాయకులు ఎన్టీ రామారావు గారని పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం తీసుకొచ్చిన అటువంటి నాయకులు ఎన్టీ రామారావు అని ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .అనంతరం పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మొట్టక ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి కలకోట రమేష్ వైస్ ఎంపీపీ కాసార్ల ఏలీయా TNTUC మండల అధ్యక్షులు గాడబోయిన బిక్షపతి మరియు సీనియర్ నాయకులు నీలం సారంగం, కాల్వ నర్సింగం మరియు ఎల్లయ్య, యాకయ్య బాలయ్య సమ్మయ్య కుమార్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

You may also like...

Translate »