డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్

జ్ఞాన తెలంగాణ, జ్ఞాన దీక్ష డెస్క్:

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 11,062 ఖాళీలతో వెలువడిన డీఎస్సీ( డిస్టిక్ సెలక్షన్ కమిటీ) / టిఆర్టి( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఉన్నట్లు హైదరాబాద్ లోని రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది.ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సమయుతమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుండి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీలు ఉన్న కేంద్రాలలో పాటుగా ఎంపిక చేసిన ఇతర కళాశాలలో  కలిపి మొత్తం 16 ప్రాంతాలలో ప్రతి కేంద్రానికి 100 మంది కి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారుఅభ్యర్థులు డైట్ లేదా టేట్ ఉత్తీర్ణులై ఉండాలి.పూర్తి వివరాలు మార్చి 11 నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.సంప్రదించాల్సిన

వెబ్ సైట్ :tsstudycircle.co.in

You may also like...

Translate »