టెట్‌ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం


ఈ నెల 22 వరకు గడువు


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చని టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. 16వ తేదీ నాటికి మొత్తం 1,26,052 దరఖాస్తులు అందాయన్నారు. అందులో పేపర్‌-1కు 39,741, పేపర్‌-2కు 75,712 మంది, రెండిటికీ 10,599 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా నాలుగు రోజుల గడువున్నందున మరో 50 వేల దరఖాస్తులు అందవచ్చని భావిస్తున్నారు.

You may also like...

Translate »