రైట్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టుల భర్తీ

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ‌:
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైట్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (RITES Limited) మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 40 మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లుగా నిర్ణయించగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణ నవంబర్‌ 7 నుంచి ప్రారంభమై నవంబర్‌ 30 వరకు కొనసాగుతుంది.

అప్లికేషన్‌ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు రూ.300, జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల (MCQ) రూపంలో ఉంటుంది. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది, నెగటివ్‌ మార్కింగ్‌ ఉండదు. అన్‌రిజర్వ్డ్‌/ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులు కనీసం 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 45% మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు.

ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 1:6 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ rites.com ను సందర్శించవచ్చు.

You may also like...

Translate »