ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను FORM-12

ఎన్నికల విధులలో నున్న ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను FORM-12 లో ఏప్రిల్ 26వ తేదీలోగా సంబంధిత రిటర్నింగ్ అధికారి/ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో సమర్పించవలెను .

ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంటు ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, పోలీసులు, సెక్టారు అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, డ్రైవర్లు, క్లీనర్లు, వీడియో గ్రాఫర్లు, బందోబస్తు కొరకు ఉత్తర్వులు అందుకున్న NCC, NSS, Ex-Servicemen మరియు ఇతర Uniform Services వారు పనిచేస్తున్న జిల్లాలోనే సంబందిత రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో రెండు Form-12 అప్లికేషన్లను (ఒకటి పార్లమెంటుకు, రెండవది అసెంబ్లీకు), ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు మరియు ఓటరు కార్డు ప్రతిని జతపరిచి ఏప్రిల్ 26 లోగా సమర్పించవలెను.

ఓటు వేయడానికి ఫెసిలిటేషన్ ను శిక్షణా కేంద్రాల వద్ద మరియు రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడును. “ఓటు వేయడానికి ఆఖరి రోజు మే 8.
ఈ ఫెసిలిటేషన్ వివరాలను ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులకు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు మరియు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు ముందుగానే సమాచారం అందచేయబడును.

You may also like...

Translate »