210 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా

జ్ఞాన తెలంగాణ,భూపాలపల్లి, సెప్టెంబర్ 11:
జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి మేళాను జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 11 గంటలకు భూపాలపల్లి గడప మెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు.ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 210 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నారు. ఇందులో ట్రైనీ టెక్నీషియన్‌ (50), ట్రైనీ సర్వీస్ అడ్వైజర్‌ (50), సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ (50), ట్రూ వ్యాల్యూ ఈవాల్యువేటర్స్‌ (30), కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్‌ (30) పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ITI డీజిల్ మెకానిక్‌, మోటార్ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, SSC పాస్ లేదా ఫెయిల్‌, డిప్లొమా మెక్/ఆటోమొబైల్‌, బీ.టెక్‌, ఏదైనా డిగ్రీ లేదా MBA (మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి).
వయోపరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు.
ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి పిలుపునిచ్చారు.
వివరాల కోసం ఫోన్ నంబర్లు: 9701078288, 8247656356 సంప్రదించవలసిందిగా జిల్లా అధికారులు తెలిపారు.

You may also like...

Translate »