ఇస్రో–ఎన్ఆర్ఎస్సీలో టెక్నీషియన్ పోస్టుల భర్తీ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో టెక్నీషియన్ అసిస్టెంట్ (సివిల్) 01, టెక్నీషియన్ అసిస్టెంట్ (ఈ) 01, టెక్నీషియన్–బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) 05, టెక్నీషియన్–బి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 04, టెక్నీషియన్–బి (ఎలక్ట్రికల్) 01, డ్రాఫ్ట్స్‌మన్–బి 01 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత విభాగానికి అనుగుణంగా పదో తరగతి లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణ నవంబర్ 10 నుంచి ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.
పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానానికి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు nrsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
