ఉచిత శిక్షణ త్వరపడండి

Image Source | Placement India
ఐబిపిఎస్ (Institute of Banking Personnel Selection) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ, ఎస్సీ, బిసి విద్యార్థులకు గిరిజన శాఖ ఉచిత శిక్షణ.
ఐబిపిఎస్ (Institute of Banking Personnel Selection) పిఓస్(ప్రొబేషనరీ అధికారి) క్లర్క్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలకు సిద్దమయ్యే నిరుపేద అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు అవసరమయ్యే శిక్షణను ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు 60 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకుగాను పిఈటిసి హైదరాబాద్లో ఏర్పాట్లు చేయడమైందని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థుల డిగ్రీ ఆధారంగా ఎస్టీ-75, ఎస్సీ – 15, బీసీ-10మ చొప్పున 100 మంది అభ్యర్థులుకు అక్టోబర్ 16 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. శిక్షణ పొందుటకు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు స్వీకరించనున్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన శిక్షణకై అభ్యర్థులు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3లక్షలు దాటకూడదని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆఫీస్ కార్యాలయంలోని 040 – 27540104 నెంబర్కు ఫోన్ చేసి ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించాలని ఆయన సూచించారు.