ANM దరఖాస్తు కు చివరి తేదీ అక్టోబర్ 3 వరకు పొడిగింపు

Image Source | X.Com

ఏఎన్ఎంల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతంలో ఈనెల 19 వరకు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించింది, ప్రస్తుతం దరఖాస్తు చివరి తేదీని పెంచుతూ ఏఎన్ఎం అక్టోబర్ 3 వరకు దరఖాస్తు అభ్యర్థులు చేసుకోవచ్చని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు గారు తెలిపారు.
1931 పోస్టులకు దరఖాస్తు 19 చివరి తేదీ ఉండగా, దరఖాస్తు చేసుకునే ఏఎన్ఎం అభ్యర్థుల కు సరైన సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకోగా సమయానికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించి అక్టోబర్ 3 వరకు చివరి తేదీ పెంచింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అక్టోబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 3 ఆఖరు తేదీ.గా ప్రకటించినట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 49 ఏళ్లు మించరాదు.

You may also like...

Translate »