తెలుగు మరియు ఆంగ్ల భాషలో లో డీఎస్సీ ప్రశ్నపత్రాలు

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించబోతున్నా డీఎస్సీ పరీక్షలను రెండు భాషల్లో నిర్వహించనున్నారు. ఆంగ్ల భాషతో తో పాటు గా , అభ్యర్థులు ఎంపిక చేసుకొనే మీడియంలో ప్రశ్నలిస్తారు. ఇలా తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదో ఒక భాషను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. 5,089 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ నెల 20 వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేటప్పుడే అభ్యర్థులు తాము పరీక్ష రాసే భాషను ఆప్షన్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రకారమే ప్రశ్నపత్రాలను ఇస్తారు.
