ఈ నెల 20 నుంచి DSC అప్లికేషన్స్

Image Source | Unsplash
టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన DSC (District Selection Committee) దరఖాస్తుల తీసుకోవడం ఈనెల 20 నుంచి ప్రారంభం చేయనుంది. వచ్చే నెల 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 వ తేదీ నుంచి నవంబర్ 30 వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు.5,085 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తారు.