ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షిటిపేట్‌లో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


జ్ఞాన తెలంగాణ, లక్షిటిపేట్, జనవరి 18:
మంచిర్యాల జిల్లా లక్షిటిపేట్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ బి.ఎ.–బి.ఎడ్. (Integrated B.A–B.Ed., E/M) కోర్సులో బోధన నిర్వహించేందుకు అతిథి అధ్యాపకుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియలో పొలిటికల్ సైన్స్–01, సైకాలజీ–01 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలని, అలాగే బి.ఎడ్., సెట్, నెట్, పీహెచ్‌డీ అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో కలిసి ఈ నెల 22వ తేదీలోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లక్షిటిపేట్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు

You may also like...

Translate »