భారత సైన్యంలో ‘అగ్నివీర్’ల నియామకానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ పదోతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ, ఐటీఐ, డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష తెలుగు, తమిళంతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తొలిదశలో రాతపరీక్ష, మలిదశలో శారీరక దారుఢ్య పరీక్షలు ఉంటాయి. కనీస వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని ట్రేడ్లకు కనీస విద్యార్హత 8వ తరగతి కాగా, మరికొన్నింటికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.