బౌద్ధ ధర్మం: స్వీయ ఆధారిత జీవన మార్గం.

Buddhism: A self-reliant way of life.
మన జీవితానికి మనమే ఆధారము : బౌద్ధ ధర్మంలో “దేవుడా మాకు సంపద ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆస్తులు ఇవ్వు” అనే కోరికలు లేవు.బుద్ధుడు బోధించిన ధర్మం కనబడని దేవునిపై ఆధారపడే ధర్మం కాదు. ఆయన ఉపదేశం – మన కృషి మనమే చేయాలి, మన జీవితం మన చేతుల్లోనే ఉంది.
కర్మకాండలు లేని బోధన : బ్రాహ్మణ పురోహితులు చేసే యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, కర్మకాండలు, అభిషేకాలు బౌద్ధ ధర్మంలో లేవు. ఎందుకంటే అవి మానవ జీవనానికి ఉపయోగపడవు. భగవాన్ బుద్ధుడు చెప్పింది ప్రయోజనకరమైనది మాత్రమే అనుసరించాలి అని.కన్నీటి ప్రార్థనలు, దయల కోసం వేడుకోవడం బౌద్ధ ధర్మంలో ఉండదు.
స్వీయ విశ్వాసం – బౌద్ధుడి బలం : బౌద్ధ ధర్మంలో “దేవుడా మమ్మల్ని కాపాడు” అనే మానసిక బలహీనత ఉండదు. బౌద్ధుడు తన మీద తనకే విశ్వాసం పెంపొందించుకోవాలి. దేవుడి మీద ఆధారపడటం వలన మనసులో దాస్య మనస్తత్వం ఏర్పడుతుంది. అందుకే తథాగత బుద్ధుడు ఉపదేశించాడు
“తథాగతుడు బోధకుడు మాత్రమే, కానీ నడవాల్సిన మార్గం నీదే.”
భగవాన్ బుద్ధుని బోధన – జపాలు, తపసులు లేని మార్గం. :భగవాన్ బుద్ధుడు ప్రార్థనలు, జపాలు, తపసులు వంటి వాటిని తిరస్కరించాడు. ఆయన చెప్పినది – “మార్గాన్ని నేను చూపుతాను, నడవాల్సింది నువ్వే.”
అంటే బౌద్ధ ధర్మం స్వీయ కృషి ఆధారిత ధర్మం.
– విపస్సన ధ్యానం – మానసిక ఔషధం.
బౌద్ధ ధర్మంలో అత్యంత ముఖ్యమైన సాధన విపస్సన ధ్యానం. ఇది మనకు ఇచ్చే లాభాలు:
- క్రమశిక్షణ పెంపొందుతుంది.
- స్వీయ రక్షణ, స్వీయ పరిశుద్ధత కలుగుతుంది.
- జ్ఞానోదయం, వివేకశక్తి పెరుగుతుంది.
- ప్రశాంతమైన మనసు ఏర్పడుతుంది.
- హృదయం శక్తివంతం అవుతుంది.
బౌద్ధుడి వ్యక్తిత్వ వికాసం: బౌద్ధులు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో, వివేచన కలిగిన దృష్టితో జీవిస్తారు. వారి జీవితం సత్యం, హేతువు, అనుభవం మీద ఆధారపడుతుంది. అందువల్ల వారు లోకహితం కోసం పని చేస్తారు.
ముగింపు : బౌద్ధ ధర్మం మనిషిని బలహీనుడిని కాకుండా స్వీయ బలవంతుడుగా తయారు చేస్తుంది. దేవుడి మీద ఆధారపడే బానిస మనస్తత్వం తొలగించి, “నా జీవితం నా చేతుల్లోనే ఉంది” అనే ధైర్యాన్ని ఇస్తుంది.
– – అరియ నాగసేన బోధి(M.A.,M.Phil.,TPT.,LL.B)