సమాజంలోస్త్రీ – ఒక విశ్లేషణ

సమాజంలోస్త్రీ – ఒక విశ్లేషణ :
ప్రపంచ జనాభాలో మహిళలు రెండవ స్థానం. కానీ పురుషులతో సమానమైన హక్కులు పొందలేకపోతున్నారు. విషాదమేమంటే ప్రపంచమంతా స్త్రీల పట్ల అమానుషమైన అణచివేత అలుముకొని ఉన్నది. వంటింటి కుందేలు,పరదాచాటు స్త్రీగానే ఇంకా ఈ ఆధునిక యుగంలో కూడా చూడడం అనేది దారుణమైన విషయం.
చట్టాలు ఎన్ని ఉన్నా, శాసనాలు ఎన్ని చేసినా
అవి అమలుకు నోచుకోవడంలేదు.స్త్రీలకు న్యాయం జరగడం లేదు. స్త్రీని ఒక దేవతగా, అమ్మగా వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తుంటారు. పాటలు పాడి స్త్రీని ఉన్నతంగా నిలబెడతారు.
కానీ వాస్తవంలో మాత్రం స్త్రీకి అడుగడుగునా అన్యాయమే చేస్తున్నారు. అత్యాచారాలు, చేస్తున్నారు, సజీవ దహనాలు చేస్తున్నారు. స్త్రీని ఒక దేవతగా పూజించడం అవసరం లేదు కేవలం గౌరవంగా తన తోటి మనిషిగా చూస్తే చాలు.
దీనికి కారణం కూడా లేకపోలేదు. వేల సంవత్సరాల నాడు రచించిన మన పురాణాలు అన్ని మత గ్రంథాలు, ధర్మ గ్రంధాలు అన్ని కూడా స్త్రీలను చిన్న చూపు చూశాయి .పతివ్రత అని పనికిరాని, గౌరవం ఇవ్వని బిరుదు తో మభ్యపెట్టి, ఉపశమన మాటలు మాట్లాడి పురుషులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. వారిని నోరెత్తకుండా చేస్తున్నారు వారికి చెందవలసిన హక్కులు వారికి కల్పించడం లేదు.
ఆడదంటే అనాది నుండి చిన్న చూపు.
ఈ ఆధునిక యుగంలో కూడా సైన్సు పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ వేల సంవత్సరాల నుండి మత గ్రంధాల నియమాల సంప్రదాయాలతో, మూఢాచారాల వలలో చిక్కిన ఈ సమాజం, స్త్రీ పట్ల అనాదరణ భావమే చూపుతోంది. మూఢాచారాల మత గ్రంధాలలోని పురుష పాత్రలను దేవుళ్ళుగా, దైవాంశ సంభూతులుగా చిత్రీకరించడం , వారు చేసినవన్నీ మహిళలపట్ల ప్రవర్తించినవన్నీ, ధర్మకార్యాలుగా, న్యాయాలుగా సమర్థించుకోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది.
స్త్రీల అణచివేతకు కారణాలు:
*కులమతాలు
*మత గ్రంథాలు
“సమాజములో అభద్రతా భావం
*పురుషాధిక్య సమాజం
*పాలకులు, రాజ్యాంగంలో పొదుపరిచిన హక్కులను అమలు పరచకపోవడం.
సమాజంలో స్త్రీ పట్ల అసహ్యత.
ఎన్నో విధాలుగా హింస.
గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల పుట్టకూడదని దేవుళ్లకు మొక్కుతారు.
పుట్టగానే భర్త అత్తమామల పెదవి విరుపులు.
పుట్టిన ఆడపిల్ల పట్ల అసహ్యత.
వికారమైన చూపులు.
పుట్టగానే ఆడపిల్ల పుట్టగానే “ఆడ” పిల్ల అని అనడానికి కారణం ఏంటి? ఈ ఇంటి పిల్ల కాదు ఎప్పుడైనా అత్తగారింటికి వెళ్ళవలసిందే అని అర్థమట
ఆడపిల్ల తిరుగుతుండగా మగ పిల్లలను గారాబంగాఆడపిల్లలను నిరాసక్తంగా తిట్లతో వేధింపులతో పెంచడం.
ఆడపిల్లలకు చదువు ఎందుకు ఇంట్లో ఉండి వండి పెట్టేది కదా అని భావించడం.
ఆడపిల్ల తనతో పుట్టిన తమ్ముళ్లకు అన్ని రకాల చాకిరీ చేస్తూ ఉండడం
10 12 ఏండ్ల వయసప్పుడే పెళ్లి చేయాలన్న ఆరాటం.
ఇంట్లో నుండి ఎప్పుడు బయటకు పంపించడమా అని ఆలోచించడం.
ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా తల్లిదండ్రుల ఇష్టప్రకారమే వరుడిని వెతికి పెళ్లి చేయడం.
పెళ్లి సమయంలో కట్నాలు కానుకలు ఇచ్చి పురుషుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం.
సాధారణంగా ఏదైనా దానం పుచ్చుకున్న వ్యక్తి దానిని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు.
లేక ఇంకొకరికి కూడా దానంగా ఇవ్వచ్చు.
ఇలాంటి భావన ఒక స్త్రీ పట్ల చూపడం అనేది సమాజ దౌర్భాగ్యమైన నీచమైన భావన.
దీనిని ప్రతిఘటించే వారు ఎవరూ లేరు.
కనీసం స్త్రీలైనా దీనిని ప్రతిఘటించడం లేదు.
పెళ్లి సమయంలో” వధువు” యొక్క తండ్రి కన్యాదానం ఇస్తున్నానని అనడం “వరుడి” తండ్రి కన్యాదానం పుచ్చుకుంటున్నానని అనడం
“కన్యాదానం” అనే ఒక హేయమైన సంస్కృతి
మన సమాజంలో ఉంది.
దానం అంటే వస్తువును డబ్బులు దానం చేస్తారు.
కానీ మనుషులను దానం చేయడం అనేది సమాజంలో అత్యంత నీచమైన భావన.
ఇది ఆడవారి పై ఉన్నా నిర్లక్ష్యం. చిన్న చూపు. అణచివేత ధోరణి.
స్త్రీని ఒక విలాస వస్తువుగా, ఒక పదార్థంగా, భావించడం.
సంవత్సరాల వారీగా గృహహింస కేసులు
2006 సంవత్సరంలో 63128 గృహహింస కేసులు
2007 సంవత్సరానికి 75 930 కేసులు
2008 సంవత్సరానికి గాను 81 344 కేసులు
2009 సంవత్సరానికి గాను 89 546
2010 సంవత్సరానికి గాను 94, 041
2011 సంవత్సరానికి 99 వేల 135
2012 సంవత్సరానికి ఒక లక్షా 60 వేల ఐదు వందల 27
2013 సంవత్సరానికి 1,06,527 కేసులు
2014 సంవత్సరానికి 1,22,877 కేసులు
ఏ యేటి కా యేడు కేసులు పెరగడమే కానీ తగ్గడం లేదు. లాక్డౌన్ లో మరింతగా గృహ హింస పెరిగింది.
గృహ హింస చాలావరకు దళితులపైన జరిగినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి.
స్త్రీపై శ్లోకం
॥ కార్యేషు దాసీ ….. ఎవరికీ?
కరణేషు మంత్రీ …… ఎవరికి?
రూపేచ లక్ష్మీ …… ఎవరికీ?
క్షమయా ధరిత్రీ ….. ఎవరికీ?
భోజ్యేషు మాతా …… ఎవరికీ?
శయనేషు రంభా …… ఎవరికీ?
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ .
( ఉత్తమ భార్య లక్షణాలు )
మాకే మగోళ్ళకు😊 అందుకే అలా రాసుకున్నాం.స్త్రీ
24 గంటలు మా గురించి ఆలోచించాలని.
మహిళలు తమ హక్కులను తెలుసుకుని హక్కులకోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అలాగే పురుషులు కేవలం నోటి మాటలతో, కాకుండా ఉత్సవాల పేరుతో మహిళలను
వారి హక్కులను వారు అనుభవించేటట్లు సహకరించాలని నాయొక్క మనవి—