అజీమ్ ప్రేమ్ వర్సిటీలో పీజీ అడ్మిషన్స్

Image Source | OpIndia
అజీమ్ ప్రేమ్ జి వర్సిటీలో పీజీ అడ్మిషన్స్
అజీమ్ ప్రేమ్ జి యూనివర్సిటీ… బెంగళూరు, భోపాల్లోని క్యాంపస్లలో 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో అర్హులైన అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సుల వివరాలు :
- ఎంఏ ఎడ్యుకేషన్
- ఎంఏ డెవలప్మెంట్
- ఎంఏ ఎకనామిక్స్
- మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్)
కాలపరిమితి : రెండు సంవత్సరాలు (ఫుల్ టైమ్ ప్రోగ్రామ్).విద్య అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు:-
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 24-12-2023.
ఇంటర్వ్యూ తేదీ: జనవరి, 2024.
తరగతుల ప్రారంభం: జులై, 2024.
మరిన్ని వివరాలకు వెబ్సైటు ని చూడగలరు.
వెబ్సైటు :- https://azimpremjiuniversity.edu.in/