ఆంధ్ర యూనివర్సిటీలో లా కోర్సుల అడ్మిషన్స్

ఆంధ్ర యూనివర్సిటీలో లా కోర్సుల అడ్మిషన్స్

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(ఏయూ డీఓఏ) – ఎల్ఎల్బీ సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రా మ్ల లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడు దల చేసింది. మూడేళ్లు, అయిదేళ్ల వ్యవది గల లా ప్రోగ్రామ్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వర్సిటీ ఆధ్వర్యంలోని డా.బీఆర్.అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా నిర్వహిస్తుంది. వీటికి ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ వర్తించదు. స్కాలర్షిప్ సౌకర్యం లేదు. రిజర్వేషన్లు మాత్రం వర్తి స్తాయి.
అర్హులైన ఆసక్తి కల్గిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి వర్సిటీ చిరునామాకు పంపాలి.

అయిదేళ్ల ఎల్ఎ ల్బీ: ఈ ప్రోగ్రామ్లో 18 సీట్లు ఉన్నాయి. ఏదేని గ్రూప్తో ఇంటర్/పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. బీసీ అభ్యర్థు లకు 42 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. మూడేళ్ల ఎలీలీ: ఈ ప్రోగ్రామ్లో 15 సీట్లు ఉన్నాయి. కనీసం 45 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. బీసీ అభ్యర్థులకు 42 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు.

ఎంపిక: కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. లాసెట్/పీజీ లాసెట్/క్లాట్ అర్హత పొందినవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో అకడమిక్ ప్రతిభ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.

కోర్సు ఫీజు: రూ.90,000 కౌన్సెలింగ్ ఫీజు: రూ.600

3 కౌన్సెలింగ్: అక్టోబరు 21న

దరఖాస్తు ఫీజు: రూ.2,000

చివరి తేదీ: అక్టోబరు 20

వెబ్సైట్: www.audoa.in

You may also like...

Translate »