ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో నేరుగా ప్రవేశాలు

ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉన్నాయని జడ్చర్ల సమీపంలోని మాచారం గ్రామ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మరియు పీజీ కళాశాల (బాయ్స్) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో 2023-24 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నమని కళాశాల ప్రిన్సిపల్ కేపీ నిరీక్షణ రావు బుధవారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఇంటర్ ఎంపిసీ, బైపీసీలో 40% మార్కులతో ఉత్తీర్ణులైనవారు నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ పొందవచ్చని సూచించారు.
