🔊JNVST Hall tickets: జవహర్ నవోదయలో ఆరోగతరగతి పరీక్ష హాల్ టికెట్లు విడుదల

Image Source|Career Power
JNVST Hall tickets: జవహర్ నవోదయలో ఆరోగతరగతి పరీక్ష హాల్ టికెట్లు విడుదల
🍥దిల్లీ: రాబోయే విద్యా సంవత్సరానికి (2024-25) జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా జేఎన్ వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి జనవరి 20న ఎంపిక పరీక్ష(JNVST 2024)కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష (Jawahar Navodaya Vidyalaya selection test)కోసం జూన్ నుంచి ఆగస్టు వరకు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్చే సుకోవచ్చు.
Link:
https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard?AspxAutoDetectCookieSupport=1
Exam Date : 20/Jan/2024
