కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా?

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. లాటరీ ప్రక్రియ నిర్వహించి విద్యార్థులను ఎంపిక ప్రక్రియ షురూ చేశారు. ఇందులో భాగంగా తాజాగా అప్లికేషన్‌ స్టేటస్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో లాగిన్‌ కోడ్‌తో ఎంటర్‌ అయితే మీరు ఎంపిక చేసుకున్న మూడు కేవీల్లో మీ లాటరీ నంబర్‌తో పాటు పాఠశాలల వారీగా వెయిటింగ్‌ లిస్ట్‌ వివరాలను పొందుపరిచారు. ఈ వివరాలు లాటరీ తర్వాత మీ అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం మాత్రమేనని పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ మాత్రం కాదని పేర్కొంది.

ధ్రువీకరణ పత్రాల పరిశీలన తర్వాత కేవీ సంఘటన్‌ నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్‌ స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. తుది జాబితాలు, మరిన్ని వివరాల కోసం సంబంధిత పాఠశాలలను సంప్రదించాలని కేవీ సంఘటన్‌ పేర్కొంది.

కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (KVS) ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని నిబంధన విధించారు. మీ అప్లికేషన్‌ స్టేటస్‌ను తెలుసుకొనేందుకు https://kvsonlineadmission.kvs.gov.in/index.html వెబ్‌సైట్‌ను సందర్శించండి. పైన పేర్కొన్న చెక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి.. మీ లాగిన్‌ కోడ్‌, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి మీ అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

You may also like...

Translate »