ఆదిలాబాద్ లో ఈనెల 23 న గురుకుల అడ్మిషన్లకు స్పాట్ కౌన్సిలింగ్

Image Source | IndianMART

ఆదిలాబాద్ లో ఈనెల 23 న గురుకుల అడ్మిషన్లకు స్పాట్ కౌన్సిలింగ్
– రీజినల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి గారు

2023 – 24 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి ఖాళీలను మరియు బ్యాక్ లాగ్ లో ఉన్న అతికొద్ది ఖాళీలు అయిన 6, 7, 8 మరియు 9వ తరగతులలో మిగిలిపోయిన కొద్ది సంఖ్యలో గల ఖాళీలను భర్తీ చేయడానికి 23 సెప్టెంబర్ 2023 న ఉదయం 10.00 గంటలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యాలయం బాలికలకు లక్షెట్టిపెట్ లో (బాలురు మరియు బాలికలకు) స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని, రీజినల్ కోఆర్డినేటర్, కొప్పుల స్వరూపారాణి గారు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే వారు ఈ క్రింది విషయాలను గమనించాలని కొద్ది సంఖ్యలోనున్న అన్ని ఖాళీలను నింపడానికి ఎస్సీ అభ్యర్ధులకు మాత్రమే ప్రాధాన్యత కల్పించబడునని తెలిపారు.

వి. టి. జి – 2023 24 విద్య సంవత్సరం లో నాలుగు ఫేజ్ లలో, మరియు బి ఎల్ వి సెట్- 2023 – 24 ఐదు ఫేజ్ లలో, ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులు వివిధరకాల కారణాలవల్ల పాఠశాలలో జాయిన్ కాకుండా ఉన్నట్టయితే, అట్టి వారికే ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఇందులో కూడా ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే వారు వి.టి.జి సెట్ బి.ఎల్. వి సెట్ 2023 విద్య సంవత్సరానికి సంబంధించినహాల్ టికెట్ ను మరియు అడ్మిషన్ అలాట్ మెంట్ రిజల్ట్ షీట్ ను కౌన్సిలింగ్ కి వెంట తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్లు. కేటాయించే సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి . చెందిన శారీరక వికలాంగులకు, ఆర్ఫాన్స్, మరియు సెమీ ఆర్ఫాన్స్ విద్యార్ధినీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడునని, స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే సమయంలో వీరు కూడా తమ అర్హతను తెలిపే సర్టిఫికెట్లను తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే . విద్యార్ధినీ విద్యార్థులు పై అంశములన్నింటినీ జాగ్రత్తగా పరిగణించుకొని, అర్హత లు తెలియజేసే ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రాలతో రావాల్సి ఉంటుందని ఆదిలాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూప తెలిపారు.

You may also like...

Translate »