గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :


ఆదిలాబాద్, జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(పురుషులు,బోథ్)లలో డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.శివకృష్ణ తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మా కళాశాలలో బి.ఎ (హెచ్. ఈ.పి), బి.కాం(సి.ఎ),బి.యస్.సి–బి. జేడ్. సి, యం.పి.సి.యస్,యం.యస్.డి.యస్ తదితర ఒక్కోక్క కోర్సులలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి అని తెలియజేశారు. జాతీయ స్థాయిలో న్యాక్ బి గ్రేడ్ సాధించి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో గిరిజన విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యా బోధన, వసతితో పాటు ఉచితంగా పుస్తకాలు,నోట్ పుస్తకాలు, కాస్మోటిక్స్ చార్జీలు ఇంకా ఎన్నో సౌకర్యాలు ,సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

ఇతర వివరాలకై : 9849390495, 7901097689 సంప్రదించండి.

You may also like...

Translate »