నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్

నేటితో ముగియనున్న TS EAPCET(EMCET) నోటిఫికేషన్
- నేటికె 3.31 లక్షల దరఖాస్తులు
- ఆలస్య రుసుం లేకుండా నేడే ఆఖరు
హైదరాబాద్:తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS E APCET):
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (ఎంసెట్)కు 3,31,934 దరఖాస్తులొచ్చాయి
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటి వరకే ఉన్నది. ఆలస్య రుసుంతో మే ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. ఈ మేరకు ఎప్సెట్ కన్వీనర్ , కోకన్వీనర్ కె విజయకుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,40,150 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 91,497 మంది, ఆ రెండు విభాగాలకూ 287 మంది కలిపి మొత్తం 3,31,934 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. మే ఏడు నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో ఎప్సెట్ రాతపరీక్షలను నిర్వహిస్తారు. మే ఏడు, ఎనిమిది తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలను, తొమ్మిది నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు జరుగుతాయి. ఇతర వివరాల కోసం https://eapcet.tsche.ac.in/ వెబ్సైటు ని సంప్రదించండి