TGEAPCET Counselling 2024:(ఎంసెట్)

TGEAPCET Counselling 2024:(ఎంసెట్)

జులై 4 నుంచి ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

మూడు దశల్లో ప్రవేశాల ప్రక్రియ

జ్ఞాన తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్రం లోని ఇంజినీరింగ్, ఫార్మ సీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. టీజీ ఈఏపీసెట్‌ వెబ్‌
బేస్డ్‌ కౌన్సె లిం గ్‌ 2024 ఎంపీసీ స్ట్రీమ్‌కు సంబంధించిన తేదీలను (రివైజ్డ్‌) రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.

మే 7 నుంచి 11వ తేదీ వరకు టీజీ ఈఏపీసెట్‌ జరగ్గా.. ఫలితాలను మే 18న విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగం లో 74.98%, అగ్రికల్చ ర్ అండ్ ఫార్మ సీ విభాగం లో 89.66% ఉత్తీర్ణత నమోదైంది. ఈ కౌన్సెలింగ్‌
ద్వారా బీఈ/ బీటెక్‌/ ఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశాలు కల్పి స్తారు. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు ఈఏపీసెట్‌ 2024తో పాటు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ సబ్జెక్టులు జనరల్‌ 45%, ఇతరులు 40% మార్కు లతో ఉత్తీర్ణులై ఉండాలి.

🔸తొలిదశ జులై 4 నుంచి 23 వరకు,
🔸రెండోదశ జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు,
🔸 తుదిదశ ఆగస్టు 8 నుండి ఆగస్టు 15 వరకు కొనసాగనుంది

You may also like...

Translate »