తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు

తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు

  • సీట్లు రాని వారికి మరో అవకాశం

తెలంగాణ రాష్ట్రంలోప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు వెలువడ్డాయి. ఇప్పటికే ఐసెట్ తొలి, మలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా.. మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ ఎ.శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ ఎ.శ్రీదేవసేన తెలిపారు. ఇప్పటి వరకూ సీట్లు పొందని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

You may also like...

Translate »