ఉమ్మడి సంగారెడ్డి లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్

Image Source | IndiaMART
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లకు ఈనెల 23వ తేదీన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ పర్యవేక్షకులు భీమయ్య గారు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇస్నాపూర్ లోని గురుకుల పాఠశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.
ఎస్సీ అనాధ సెమీ అనాధ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని సంబంధిత ధ్రువపత్రం తీసుకొని రావాలని కోరారు.
2023 2024 వ సంవత్సరానికి వి.టి.జి.సి.ఈ.టి. వివిధ పరీక్షలలో సీటు వచ్చినప్పటికి జాయిన్ అవ్వని వారికి, తల్లి దండ్రులు లేని అనాధ బిడ్డలకు, వికలాగుల కు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
స్పాట్ అడ్మిషన్స్ కొరకు హాజరయ్యేవారు వారి యోక్క హల్‌టికెట్, ర్యాంక్ కార్డులను వెంట తీసుకోని రావాలిని తెలిపారు,
అనాధ బిడ్డలు వారి చనిపోయిన తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని, వికలాగులు వారి వికలాంగుల పత్రాలను తీసుకొని రావాలని అన్నారు.
