నాబార్డ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్

నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్
ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవ లప్మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి ‘స్టూడెంట్ ఇంటర్న్షిప్ స్కీమ్’లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఇంటర్న్షిప్ 8 నుండి 12 వారల పాటు ఉంటుంది. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో కొన్ని సీట్లు,నాబార్డ్ ముంబై లోని హెడ్ ఆఫీస్ లో కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబైలోని సీట్లకు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పోటీపడవచ్చు. ఇంటర్న్ షిప్లో భాగంగా అభ్యర్థులు నాబార్డ్కు సంబంధించిన ప్రాజెక్ట్లు, ప్రోగ్రామ్లు, స్కీమ్లు, యాక్టివిటీస్, సక్సెస్ స్టోరీస్పై డాక్యుమెం టేషన్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్న్షిప్ అంశాలు: కేసీసీ కవరేజ్/ఇష్యూస్ & స్ట్రాటజీ టూ ఇంప్రూవ్ లెండింగ్ త్రూ కేసీసీ బిజినెస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ పీఏసీఎస్-ఇంప్రూవింగ్ దైర్ ప్రాఫిటబిలిటీ
అర్హత: వ్యవసాయం, అనుబంధ విభాగాలు (వెటర్నరీ, ఫిషరీస్ తదితరాలు), అగ్రీ బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్(సోషి యాలజీ, జాగ్రఫీ తదితరాలు), మేనేజ్మెంట్ విభాగాల్లో పీజీ మొదటి సంవత్సరం పూర్తిచేసినవారు/అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో(‘లా’ సహా) నాలుగో సంవత్సరం చదువుతున్న అభ్య ర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: పదోతరగతి, ఇంటర్/పన్నెండోతరగతి, డిగ్రీ స్థాయుల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్స్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్
ప్రకారం సంస్థ నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. స్టయి పెండ్: నెలకు రూ.18,000ల నగదు ఇస్తారు. ఫీల్డ్ విజిట్ అలవెన్స్ కింద 30 రోజులకుగాను రోజుకి రూ.2,000/- రూ.1500 (నిబంధనల ప్రకారం) చెల్లిస్తారు. అలాగే ట్రావెల్ అలవెన్స్ కింద రూ.6,000; అదనపు ఖర్చుల కింద రూ.2,000 ఇస్తారు.
ముఖ్య సమాచారం :
- ఇంటర్న్షిప్ సమయం: మే 1 నుంచి ఆగస్టు 30 వరకు
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21
- అభ్యర్థుల షార్ట్ లిస్ట్ విడుదల: ఏప్రిల్ 23
- ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 30
వెబ్సైటు : www.nabard.org
