మహిళలకు ‘జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్

మహిళలకు ‘జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్

‘ప్రముఖ ఎంఎన్సీ ‘గూగుల్’- మహిళలకు ‘జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్’ పేరిట ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజ నీరింగ్ విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మహిళలు అర్హులు.

భారత విద్యార్థినులు ‘ఆసియా పసిఫిక్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకో వచ్చు. మొత్తం 1250 దరఖాస్తులను అనుమతిస్తారు. ఎంపికైనవారికి 2500 యూఎస్ డాలర్ల స్కాలర్షిప్ లభిస్తుంది.

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏదేని ఆసియా పసిఫిక్ దేశంలోగుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ ప్రవేశం పొందాలనుకు నేవారు అప్లయ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/ తత్సమాన సాంకేతిక విభాగాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులు ఎంచుకో వాలి. స్కూల్ స్థాయి నుంచి మంచి అకడమిక్ రికార్డ్ తప్పనిసరి. నాయ కత్వ లక్షణాలు ఉండాలి. కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన కూడా లేని వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంలో ఆసక్తి ఉండాలి. టెక్నికల్ ప్రాజెక్ట్లకు సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి.

దరఖాస్తుతోపాటు ఇచ్చిన రెండు షార్ట్ ఆన్సర్ ఎస్సే క్వశ్చన్స్ కు కనీసం 500 పదాలకు తగ్గకుండా సమాధానాలు రాసి అప్లోడ్ చేయాలి. 2023-2024 విద్యా సంవత్సరంలో డిగ్రీ రెండో ఏడాది/మూడో ఏడాది కోర్సు రిజిస్టర్ చేసుకున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్ ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

•ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 23

• website: https://buildyourfuture.withgoogle.com/

You may also like...

Translate »