నేటి నుంచి ఎప్‌సెట్‌ పరీక్షలు



నేటి నుంచి ఎప్‌సెట్‌ పరీక్షలు


  • నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
  • తొలి రెండ్రోజులు అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం పరీక్షలు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం విడత పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత పరీక్ష 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. ఉదయం పరీక్షకు 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. అగ్రికల్చర్‌-ఫార్మసీకి 87 వేల మంది, ఇంజినీరింగ్‌కు 2.20 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య బి.డీన్‌కుమార్, కో-కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల కంప్యూటర్‌ ఆగిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన సమయాన్ని కంప్యూటర్‌ ఆన్‌ అయిన తర్వాత కేటాయిస్తారని తెలిపారు*

You may also like...

Translate »