రేపటి నుండి ఎడ్సెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం

Image Source | Sakshi Education
రేపటి నుండి ఎడ్సెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 15 (జ్ఞాన తెలంగాణ): రెండు సంవత్సరాల బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టి ఎస్ ఎడ్సెట్(Telangana State Education Common Entrance Test (TS EDCET) ) చివరి విడత కౌన్సెలింగ్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది.
ఈ నెల 16 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు ఆన్లైన్ రెజిస్ట్రేషన్స్ చేసుకోవొచ్చు.ఈ నెల 21, 22 వ తేదీ లలో వెబ్ ఆప్షన్ల కు అవకాశం కల్పించడం జరిగింది. ఈ నెల 23వ తేదీ న వెబ్ ఆప్షన్ల మార్పులు చేర్పులు కు అవకాశం కల్పించారు.ఈ నెల 29వ తేదీ న అర్హులైన విద్యార్థిని,విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.సీట్లు పొందిన విద్యార్థిని,విద్యార్థులు ఈ నెల 30 వ తేదీ నుండి నవంబర్ 4 వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు ని సంప్రదించగలరు.
వెబ్సైటు : https://edcet.tsche.ac.in
