దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌


2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కమిషనర్‌ ఆఫ్‌ కొలిజియేట్‌ ఎడ్యుకేషన్‌, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవారం)నుంచి ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న ప్రత్యేక క్యాటగిరీలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేస్తారు. ఆగస్టు 3న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 3 నుంచి 6 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందిఆగస్టు 4 నుంచి 6లోగా విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రైవేట్‌, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ఆగస్టు 11, 12 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇప్పటివరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు ఇప్పుడు రూ.400 చెల్లించి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సీట్ల కోసం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. కాలేజీల్లో సీసీవోటీపీ ద్వారా తమ సీటును ఖరారు చేసుకున్న విద్యార్థులు స్పెషల్‌ ఫేజ్‌కు అర్హులు కాదని వెల్లడించారు.

You may also like...

Translate »