డిగ్రీ లో చేరేందుకు మరో అవకాశం

Image Source | PNG wing
డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులకు మరొక్క అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులు మరొక్క అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఇంజి నీరింగ్ సీట్ల భర్తీ పూర్తికాగా, ఇటీవలే ఫార్మసీ కోర్సుల సీట్లనూ కేటాయించారు. ఆయా కోర్సు ల్లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు వీలుగా అధికారులు ఈ షెడ్యూల్ను విడుదల చేశారు.ఈ మేరకు ఫస్టియర్లోని ఖాళీ సీట్ల భర్తీకి షెడ్యూల్ను శనివారం విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి కౌ న్సెలింగ్ ప్రారంభంకానున్నది.ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ను సైతం అధికారులు విడదల చేశారు.ఇంట్రా కాలేజ్ అనగా ఒక కోర్స్ లో సీటు పొంది అదే కాలేజీలో మరో కోర్స్ లోని షిఫ్ట్ కావలి అనుకునే వారికోసం ఈ అవకాశం.
ఈ నెల 19వ, 20వ తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు, ఈ నెల 21 వ తేదీ న వెబ్ ఒప్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు.