బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు

బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన విద్యార్థుల దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బి.బాలమాయాదేవి తెలిపారు. గతంలో నిర్ణయించిన గడువు ఈ నెల 15తో ముగియగా.. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 31 వరకు అవకాశమిచ్చామని ఆమె పేర్కొన్నారు.
